Karthik Raju | కౌసల్య కృష్ణమూర్తి, అథర్వ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కార్తీక్ రాజు. ఇటీవలే శ్రీవిష్ణు నటించిన సింగిల్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. కార్తీక్ రాజు సరికొత్త టైటిల్‌తో సినిమాను లాంచ్ చేసి అందరి అటెన్షన్ తనవైపునకు తిప్పుకుంటున్నాడు. కార్తీక్ రాజు నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ (Atlas Cycle Attagaru Petle). ఈ చిత్రానికి రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నాడు.
శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ ఘనంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. కాగా ఈ చిత్రానికి అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే అంటూ డిఫరెంట్ టైటిల్‌ను పెట్టి సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాడు.
ఈ మూవీ లాంచ్ సందర్భంగా డైరెక్టర్ రాజా దుస్సా మాట్లాడుతూ.. ఇది ఒక పీరియాడిక్ సినిమా. హ్యూమార్ టచ్ ఇస్తూనే.. బలమైన భావోద్వేగాలతో సినిమా ఉండబోతుంది. వరంగల్‌లో 1980లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా రాబోతుంది. శరవేగంగా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని అన్నాడు. కార్తీక్ రాజు మాట్లాడుతూ.. 80స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండనుంది. సక్సెస్‌తో దూసుకెళ్తున్న కాజల్ చౌదరితో పనిచేయడం ఎక్జయిటింగ్‌గా ఉందన్నాడు.
Hero @Imkarthikraju Speech at #AtlasCycleAttagaruPetle Movie opening #KarthikRaju #newmovie #weekend #films pic.twitter.com/8j8df4waJ0
— Sai Satish (@PROSaiSatish) May 24, 2025