IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్(105 నాటౌట్) సెంచరీతో గర్జించాడు. ఢిల్లీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బౌలర్లకు మూడు చెరువల నీళ్లు తాగిస్తూ వీరోచిత శతకంతో విరుచుకుపడ్డాడీ చిచ్చరపిడుగు. ఓపెనర్ ట్రావిస్ హెడ్(76) సూపర్ హాఫ్ సెంచరీతో గట్టి పునాది వేయగా.. క్లాసెన్ తన మార్క్ విధ్వంసంతో కోల్‌కతా స్పిన్నర్లకు చుక్కలు చూపించాడు. ఇషాన్ కిషన్(29)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ పవర్ హిట్టర్ స్కోర్ 200 దాటించాడు. ఆఖర్లో అనికేత్ వర్మ(12 నాటౌట్) మెరుపులతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికికే 278 పరుగులు చేసింది.
ఐపీఎల్లో రికార్డులు బద్ధలు కొట్టాలన్నా.. అత్యధిక స్కోర్‌తో చరిత్ర సృష్టించాలన్నా అది సన్‌రైజర్స్‌కే సాధ్యం. అవును.. ఈ సీజన్ ఆరంభ పోరులోనే 286 కొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. చివరిదైన లీగ్ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్ (76) మెరుపు అర్ద శతకానికి తోడూ.. హెన్రిచ్ క్లాసెన్(105 నాటౌట్) కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఊచకోత కోయగా సన్‌రైజర్స్ 278 రన్స్ చేసింది.
Breathtaking and Belligerent 🫡
Describe Heinrich Klaasen’s second #TATAIPL 💯 in one word 👇
Scorecard ▶ https://t.co/4Veibn1bOs #SRHvKKR | @SunRisers pic.twitter.com/HOIgoCYtTO
— IndianPremierLeague (@IPL) May 25, 2025
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(32), ట్రావిస్ హెడ్(76)లు ఎప్పటిలానే శుభారంభం ఇచ్చారు. కోల్‌కతా బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో, పవర్ ప్లేలోనే స్కోర్ చేరింది. దంచికొడుతున్న ఈ జోడీని సునీల్ నరైన్ విడదీశాడు. పెద్ద షాట్‌కు యత్నించిన అభిషేక్ .. బౌండరీ లైన్ వద్ద రింకూకు దొరికాడు. దాంతో, 92 వద్ద తొలి వికెట్ పడింది. కాసేపటికే హెడ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
Innings Break!#SRH register #TATAIPL‘s third-highest total courtesy of Heinrich Klaasen’s blazing ton! 🧡
Will #KKR chase it down and rewrite history?
Scorecard ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR pic.twitter.com/zxPKCjDII8
— IndianPremierLeague (@IPL) May 25, 2025
ఆ తర్వాత దంచుడు మొదలు పెట్టిన హెన్రిచ్ క్లాసెన్(105 నాటౌట్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు) శివ తాండవం చేశాడు. కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని లక్ష్యంగా చేసుకున్న క్లాసెన్ అతడు వేసిన 10వ ఓవర్లో 3 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత రస్సెల్ ఓవర్లో బౌండరీ కొట్టిన ఈ చిచ్చరపిడుగు హర్షిత్ రానా ఓవర్లో వరుసగా 4, 6, 6 ద్వారా 17 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఆ తర్వాత నరైన్ బౌలింగ్‌లో హెడ్ ఔటైనా సన్‌రైజర్స్ స్కోర్ వేగం మాత్రం తగ్గలేదు.
ఇషాన్ కిషన్(29) అండగా రెచ్చిపోయిన క్లాసెన్ నరైన్ ఓవర్లో సిక్సర్‌తో 14.4 ఓవర్లకే స్కోర్ 200 దాటించాడు. మరో ఎండ్‌లో ఇషాన్ సైతం బౌండరీలతో అలరిస్తూ కీలక కోల్‌కతా బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. 19వ ఓవర్లో కిషన్ ఔట్ అయినా.. ఆ ఓవర్ చివరి బంతికి డబుల్స్ తీసిన క్లాసెన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిరుడు ఆర్సీబీపై వంద కొట్టిన ఈ వికెట్ కీపర్.. ఐపీఎల్లో రెండో శతకం నమోదు చేశాడు. 6 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండడం విశేషం. నోర్జి వేసిన 20వ ఓవర్లో అనికేత్ వర్మ(12 నాటౌట్) వరుసగా 6, 4, కొట్టాడు. దాంతో, కమిన్స్ సేన నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 278 రన్స్ కొట్టింది.
𝙃𝙪𝙧𝙧𝙞𝙘𝙖𝙣𝙚 𝙃𝙚𝙞𝙣𝙧𝙞𝙘𝙝 🌪
A brutal 💯 in just 3⃣7⃣ balls by the explosive #SRH six-hitting machine 🔥
Joint third fastest hundred in #TATAIPL 👏
Updates ▶ https://t.co/4Veibn1bOs #SRHvKKR | @SunRisers pic.twitter.com/GJhS0HObUe
— IndianPremierLeague (@IPL) May 25, 2025