హైదరాబాద్, ఆట ప్రతినిధి: గత సీజన్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘బ్లాక్ బస్టర్’ ఆటతీరుతో దుమ్మురేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) శనివారం నుంచి కొత్త సీజన్‌ను ప్రారంభించబోతోంది. నిరుడు తృటిలో కప్పు కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి మాత్రం టైటిల్‌ను వదలకూడదనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌తో ట్రోఫీ వేట మొదలుపెట్టనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి వంటి హిట్టర్లకు తోడు సారథి పాట్ కమిన్స్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లతో పటిష్టంగా ఉన్న హైదరాబాద్.. ‘తొలి ఆట’తోనే బొమ్మ అదరగొట్టాలని భావిస్తోంది.