Sunil Gavaskar | రాబోయే పదేండ్లలో ‘క్రీడా దేశం’గా భారత్.. జోస్యం చెప్పిన క్రికెట్ దిగ్గజం
Sunil Gavaskar : ప్రపంచ క్రీడా యవనికపై భారత దేశ త్రివర్ణ పతాకాన్ని(Indian Flag) ఎగరేసే రోజు ఎంతో దూరంలో లేదని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) అన్నాడు. రాబోయే 10-15 ఏండ్లలో భారత్ క్రీడల్లో సూపర్ పవర్‌గా ఎదుగుతుందని అతను జోస్యం పలికాడు. ప్రపంచ ఆథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా(Neeraj Chopra) స్వర్ణ పతకం నెగ్గిన....
Sunil Gavaskar : ప్రపంచ క్రీడా యవనికపై భారత దేశ త్రివర్ణ పతాకాన్ని(Indian Flag) ఎగరేసే రోజు ఎంతో దూరంలో లేదని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) అన్నాడు. రాబోయే 10-15 ఏండ్లలో భారత్ క్రీడల్లో సూపర్ పవర్‌గా ఎదుగుతుందని అతను జోస్యం పలికాడు. ఇటీవలి కాలంలో అథ్లెటిక్స్, చెస్, బ్యాడ్మింటన్ వంటి పలు ఆటల్లో మనదేశస్థులు దూసుకెళ్తున్నారని, ఇది దేశాన్ని క్రీడా కేంద్రంగా మార్చే శుభ పరిణామమని గవాస్కర్ తెలిపాడు. అమెరికా, ఆస్ట్రేలియా మాదిరిగా రాబోయే 10-15 సంవత్సరాల్లో భారత్ కూడా ‘క్రీడా దేశం’గా ఎదగడం ఖాయమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ ఆథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా(Neeraj Chopra) స్వర్ణ పతకం నెగ్గిన అనంతరం సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘గతంలో కొన్ని ఆటలకు మాత్రమే మనదేశంలో ఎక్కువ ప్రాధాన్యం దక్కేది. జనం కూడా వాటి గురించే మాట్లాడుకునేవారు. కానీ, కాలం మారుతోంది. మీడియా కూడా వేరే ఆటలకు అధిక కవరేజి ఇస్తోంది. ఇతర క్రీడల్లోనూ భారత్ నుంచి చాంపియన్లు దూసుకొస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలిచిన సమయంలో నేను ఇంగ్లండ్‌లో ఉన్నా. అప్పుడు ప్రముఖ బాలీవుడ్ గీతం ‘మేరే దేశ్ కి ధర్తీ’ పాట పాడుతూ అతడి విజయాన్ని ఎంజాయ్ చేశా. నిన్న రాత్రి నీరజ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ నెగ్గినప్పుడు కూడా నాకు అచ్చం అలాంటి భావనే కలిగింది’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిచాక సంతోషంతో డాన్స్ చేస్తున్న గవాస్కర్

అంతేకాదు బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) సత్తాచాటాడని, అతను ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడిని చిత్తు చేయడం చాలా ఆనందించదగ్గ విషయమని సన్నీ అన్నాడు. ఈ మధ్యే ముగిసిన చెస్ ప్రపంచ కప్‌లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద(Praggnanadhaa) రన్నరప్‌గా నిలువడం చాలా పెద్ద ఘనత అని లిటిల్ మాస్టర్ గుర్తు చేసుకున్నాడు. ఇండియా గర్వించదగ్గ గొప్ప క్రికెటర్లలో గవాస్కర్ ఒకడు. దూకుడే మంత్రగా ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేసే సన్నీఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కపిల్ దేవ్ సారథ్యంలో 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సన్నీ సభ్యుడు.
ఇవి కూడా చదవండి
Neeraj Chopra | ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా పెండ్లి అప్పుడే!.. ఆ అదృష్టవంతురాలు ఎవరో?
Kieron Pollard | పోలార్డ్ ఊచకోతకు యువ స్పినర్ బలి.. నాలుగు 100 మీటర్ల సిక్స్‌లు బాదేశాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

