Kieron Pollard | పోలార్డ్ ఊచకోతకు యువ స్పినర్ బలి.. నాలుగు 100 మీటర్ల సిక్స్‌లు బాదేశాడు
Kieron Pollard : వెస్టిండీస్ విధ్వంసక ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్( Kieron Pollard) ఆడితే ఎలా ఉంటుందో తెలిసిందే. మంచినీళ్లు తాగినంత సులవుగా సిక్సర్లతో విరుచుకు పడే అతను ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో ప్రకంపనలు సృష్టించిన ఈ విండీస్ ఆటగాడు మరోసారి...
Kieron Pollard : వెస్టిండీస్ విధ్వంసక ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్( Kieron Pollard) ఆడితే ఎలా ఉంటుందో తెలిసిందే. మంచినీళ్లు తాగినంత సులవుగా సిక్సర్లతో విరుచుకు పడే అతను ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో ప్రకంపనలు సృష్టించిన ఈ విండీస్ ఆటగాడు మరోసారి దుమ్మురేపాడు. కరీబియన్ లీగ్(Caribbean Premier League 2023)లో వరుసగా నాలుగు 100 మీటర్ల సిక్స్‌లు(100 Meter Sixes) బాదాడు. ఈసారి అతడి వీర బాదుడుకు అఫ్గనిస్థాన్ యువ స్పిన్నర్ బలయ్యాడు.
విండీస్ మాజీ కెప్టెన్ అయని పోలార్డ్ కరీబియన్ లీగ్‌లో ట్రిన్బగో నైట్ రైడర్స్(Trinbago Knight Riders) తరఫున ఆడుతున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్(St Kitts, Nevis Patriots) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 15వ ఓవర్ వేసిన ఇజరుల్హక్ నవీద్(Izharulhaq Naveed)కు తన విశ్వరూపం చూపించాడు.
తన బలమంతా ఉపయోగించి వరుసగా నాలుగు బంతుల్ని వంద మీటర్ల సిక్సర్లుగా మలిచాడు. మొత్తంగా 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దాంతో, నైట్ రైడర్స్ జట్టు 179 పరుగుల టార్గెట్‌ను మరో 17 బంతులు ఉండగానే ఛేదించింది. అంతేకాదు ఈ విజయంతో పొలార్డ్ జట్టు టోర్నీలో బోణీ కొట్టింది. పోలార్డ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఎన్నో విజయాలు అందించాడు. గత సీజన్‌తో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన అతను బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.
ఇవి కూడా చదవండి
Faf Duplesis | కరీబియన్ లీగ్ మధ్యలోనే స్వదేశానికి పవర్ ప్లే కింగ్.. సర్జరీ కోసమేనా..?
Yuzvendra Chahal | టీమిండియాలో దురదృష్టానికి కేరాఫ్ అతడే.. మరో ఐసీసీ టోర్నీకి దూరమయ్యేనా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

