Faf Duplesis | కరీబియన్ లీగ్ మధ్యలోనే స్వదేశానికి పవర్ ప్లే కింగ్.. సర్జరీ కోసమేనా..?
Faf Duplesis : పవర్ ప్లే కింగ్(Power Play King)గా పేరొందిన ఫాఫ్ డూప్లెసిస్(Faf Duplesis) కొన్నాళ్లు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ప్రస్తుతం కరీబియన్ లీగ్(Caribbean Premier League 2023)లో ఆడుతున్న అతను మధ్యలోనే టోర్నీ నుంచి తప్పుకోనున్నాడు. మోచేతికి సర్జరీ(Elbow Surgery) కోసం ఈ స్టార్ క్రికెటర్ త్వరలోనే స్వదేశానికి బయలు....
Faf Duplesis : పవర్ ప్లే కింగ్(Power Play King)గా పేరొందిన ఫాఫ్ డూప్లెసిస్(Faf Duplesis) కొన్నాళ్లు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ప్రస్తుతం కరీబియన్ లీగ్(Caribbean Premier League 2023)లో ఆడుతున్న అతను మధ్యలోనే టోర్నీ నుంచి తప్పుకోనున్నాడు. మోచేతికి సర్జరీ(Elbow Surgery) కోసం ఈ స్టార్ క్రికెటర్ త్వరలోనే స్వదేశానికి బయలు దేరనున్నాడు. రెండేళ్ల నుంచి టెన్నిస్ ఎల్బో(Tennis Elbow) గాయంతో బాధపడుతున్న అతను మరి కొన్ని రోజుల్లో సర్జరీ చేయించుకోనున్నాడు.
ఇన్ని రోజులు డూప్లెసిస్ కార్టిసోన్(Cartoson Steroid Injection) ఇంజెక్షన్లు తీసుకొని నడిపించాడు. కానీ, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సర్జరీ అవసరం పడింది. అందుకని సీపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ‘టోర్నీలో మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. అయితే.. కీలకమైన దశలో జట్టును వీడుతున్నందుకు బాధగా ఉంది. ఇకపై కూడా మా టీమ్ గొప్పగా ఆడుతుందని అనుకుంటున్నా. దాదాపు రెండేళ్లు నేను టెన్నిస్ ఎల్బోతోనే మ్యాచ్‌లు ఆడాను. ఈ సమయంలో 8 కార్టిసోన్ ఇంజెక్షన్లు తీసుకున్నా. కానీ, ఇప్పుడు ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్లతో నా శరీరానికి హాని జరిగే అవకాశం ఉంది.
డూప్లెసిస్

అందుకని ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నా’ అని ఫాఫ్ తెలిపాడు. ప్రస్తుతం అతను సెయింట్ లుసియా కింగ్స్(Saint Lucia Kings) జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ టోర్నీలో మూడు ఇన్నింగ్స్‌ల్లో డూప్లెసిస్ 112 పరుగులతో రాణించాడు. అతడి గైర్హాజరీలో సికిందర్ రజా జట్టును నడిపించనున్నాడు. ఈమధ్య పొట్టి క్రికెట్లో డూప్లెసిస్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ఔరా అనిపిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుపడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నాడు.
ఐపీఎల్ పదహారో సీజన్లో దంచి కొట్టిన డూప్లెసిస్

దక్షిణాఫ్రికా టీ20 లీగ్(SA 20) తొలి సీజన్లోనూ ఈ స్టార్ ఆటగాడు దంచి కొట్టాడు. ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023)లో ఆర్సీబీ కెప్టెన్‌గా బరిలోకి దిగిన డూప్లెసిస్ పరుగుల వరద పారించాడు. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే.. కీలక మ్యాచుల్లో మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరలేదు. దాంతో, మరోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకోకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇవి కూడా చదవండి
Yuzvendra Chahal | టీమిండియాలో దురదృష్టానికి కేరాఫ్ అతడే.. మరో ఐసీసీ టోర్నీకి దూరమయ్యేనా..?
Rohit Sharma | ఆరోజు రూమ్‌లో కూర్చొని బాధ పడుతున్నా.. యూవీ అలా చెప్పడంతో మనసు తేలికైంది : రోహిత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

