Sunil Gavaskar : స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడిపోవడం ఏ జట్టుకైనా జీర్ణించుకోలేని విషయం. టర్నింగ్ పిచ్‌తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించాలనుకున్న టీమిండియా ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉంది. నెలకు ముందే వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన భారత్.. అనూహ్యంగా దక్షిణాఫ్రికాకు తలొగ్గడం అందర్నీ ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈడెన్ గార్డెన్స్‌లో రెండు రోజులు ఆధిపత్యం చెలాయించి.. మూడోరోజు చేజేతులా మ్యాచ్‌ను సఫారీలకు అప్పగించడంపై మాజీల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమికి కారణం పిచ్ కాదని, బ్యాటర్ల వైఫల్యమే ముంచిందని సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అంటున్నాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో రెండో రోజు దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు తీసి విజయం వాకిట నిలిచిన భారత జట్టు అనూహ్యంగా కంగుతిన్నది. 124 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక్కరూ క్రీజులో నిలవకపోవడంతో 93కే కుప్పకూలింది. ఈ దారుణ ఓటమితో భారత కోచ్ గౌతం గంభీర్, సెలెక్టర్లు తీవ్ర విమర్శల దాడికి గురవుతున్నారు. టీమిండియా ఓటమిని విశ్లేషించిన గవాస్కర్ బ్యాటర్లదే తప్పని తేల్చాడు. ‘క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌నే కోరుకుంటారు. అసలు ఆ ఫార్మాట్ ప్రత్యేకత అదే. అలాఅని ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు ఓటమికి పిచ్‌ను నిందించలేం. బ్యాటర్లు వైఫల్యమే పరాజయానికి కారణం.
“It’s always best to leave the curator alone because he knows his job better than anybody else”: Sunil Gavaskar#Cricket #SunilGavaskar | @NikhilNaz pic.twitter.com/64LGwcb7Fa
— IndiaToday (@IndiaToday) November 17, 2025
అందరూ స్టార్ ఆటగాళ్లే కానీ ఒక్కరు కూడా టెక్నిక్‌తో ఆడలేదు. షాట్ సెలెక్షన్ కూడా అధ్వానంగా ఉంది. స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు అని. ఇక పిచ్ గురించిన వివాదం విషయానికొస్తే ఎవరూ జోక్యం చేసుకోవద్దు. క్యూరేటర్కే పిచ్ తయారీని వదిలేయాలి. అంతేతప్ప ఫలానా వికెట్ కావాలి? టర్న్ ఉండాలి? అని ఆదేశాలు ఇవ్వడం సరికాదు’ అని గవాస్కర్ వెల్లడించాడు.
South Africa win the 1st Test by 30 runs.#TeamIndia will look to bounce back in the 2nd Test.
Scorecard ▶️https://t.co/okTBo3qxVH #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/21LHhUG5Rz
— BCCI (@BCCI) November 16, 2025
ఈడెన గార్డెన్స్ టెస్టు మూడు రోజుల్లోనే ముగియడం.. భారత్ ఓడిపోవడం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)ని సైతం ఆశ్చర్యపరిచింది. అందుకే దాదా కోచ్ గంభీర్‌కు విలువైన సలహాలు ఇచ్చాడు. ‘టీమిండియా మంచి వికెట్‌పై ఆడాలి. వరల్డ్ క్లాస్ బౌలర్లు బుమ్రా, సిరాజ్‌లను జట్టులో పెట్టుకొని టర్నింగ్ పిచ్ కోరడం ఏంటి?. టెస్టు మ్యాచ్ అంటేనే ఐదు రోజుల్లో ముగియాలి. ఈ ఓటమితో పాఠాలు నేర్చుకోవడమే కాదు.. సీనియర్ పేసర్ షమీ(Shami)ని జట్టులోకి తీసుకోవాలి’ అని గంగూలీ సూచించాడు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య నవంబర్ 22న రెండో టెస్టు గువాహటిలో జరుగనుంది.
Following Team India’s defeat, curator Sujan Mukherjee was seen in a deep discussion with CAB President Sourav Ganguly at Eden Gardens. 🏏⚡#TeamIndia #SouthAfrica #INDvsSA #FreedomTrophy #SouravGanguly #Dada #EdenGardens #XtraTime pic.twitter.com/06dIoUDIQD
— XtraTime (@xtratimeindia) November 16, 2025