CAFA Nations Cup : భారత ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) కి బిగ్ షాక్. జట్టుకోసం వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఛెత్రీకి సెంట్రల్ ఆసియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (CAFA) నేషన్స్ కప్ ప్రాబబుల్స్ కోసం ఎంపిక చేసిన బృందంలో చోటు దక్కలేదు. ఛెత్రీని తీసుకోకపోవడానికి కారణం ఏంటనేది తెలియడం లేదు.
అటు భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF)గానీ, ఇటు కొత్త కోచ్ ఖలీత్ జమిల్(Khalid Jamil)గానీ ఈ విషయంలో ఎలాంటి కామెంట్ చేయలేదు. దాంతో, కొన్నేళ్లుగా బ్లూ టైగర్స్‌కు పెద్దన్నలా వ్యవహరించిన ఈ మాజీ సారథి అంతర్జాతీయ కెరీర్‌పై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛెత్రీ వీడ్కోలు గురించి ఆలోచించే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
The 22 players who have reported to the senior men’s national team camp in Bengaluru so far 🇮🇳
More details 🔗 https://t.co/3kaTuf4UC8#IndianFootball ⚽️ pic.twitter.com/zsrBZuvmNt
— Indian Football Team (@IndianFootball) August 15, 2025
నిరుడు జూన్‌లో వీడ్కోలు పలికిన ఛెత్రీ ఈ ఏడాది యూటర్న్ తీసుకున్నాడు. చెత్త ఆటతో వరుసగా ఓడిపోతున్న బ్లూ టైగర్స్‌ను విజయపథాన నడిపించేందుకు సిద్ధమయ్యాడు. అయినా సరే సెలెక్టర్లు అతడికి మొండిచేయి చూపించారు. నేషన్స్ కప్ కోసం ఎంపిక చేసిన 35 మందిలో ఛెత్రీ ఆడుతున్న బెంగళూరు ఎఫ్‌సీ(Bengaluru FC)కి చెందిన ఆటగాళ్లు ఉన్నారు. గుర్ప్రీత్ సింగ్, రాహుల్ భెకే, రోషన్ సింగ్, సురేష్ సింగ్‌లను తీసుకున్న సెలెక్టర్లు స్టార్ ఫార్వర్డ్ అయిన ఛెత్రీని విస్మరించారు. ఆగస్టు 29న ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ వేదికగా నేషన్స్ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్ బీలో ఉంది. ఇందులోనే ఆతిథ్య తజకిస్థాన్, ఇరాన్ అఫ్గనిస్థాన్ ఉన్నాయి.
🇮🇳 India bid goodbye to its national hero, Sunil Chhetri 🥺#ThankYouSC11 | #AsianQualifiers pic.twitter.com/lnQaSk26FG
— #WAC2026 (@afcasiancup) June 6, 2024