Sumit Nagal : భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్(Sumit Nagal) ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open 2024)లో బోణీ కొట్టాడు. తొలి రౌండ్లో కజకిస్థాన్ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్(Alexander Bublik)పై గెలుపొందాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్ నుంచి ధాటిగా ఆడిన 31వ ర్యాంకర్ నాగల్ 6-4, 6-2, 7-6తో బబ్లిక్‌ను చిత్తు చేశాడు.
ఈ విజయంతో నాగల్ మూడేండ్ల తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అంతేకాదు గ్రాండ్‌స్లామ్ చరిత్రలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా నాగల్ రికార్డు నెలకొల్పాడు. 1988లో రమేశ్ కృష్ణన్(Ramesh Krishnana) తొలిసారి ఈ ఫీట్ సాధించాడు.
That’s a big win for @nagalsumit 🇮🇳
He takes out No. 31 seed Bublik 6-4 6-2 7-6(5).#AusOpen • #AO2024 pic.twitter.com/ldM9VE4X0M
— #AusOpen (@AustralianOpen) January 16, 2024
ఆ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రమేశ్ స్వీడన్‌కు చెందిన మాట్స్ విలాండర్(Mats Wilander)ను మట్టికరిపించాడు. తర్వాతి రౌండ్లో నాగల్.. జున్‌చెంగ్ షాంగ్ (చైనా), మెకెంజీ మెక్‌డొనాల్డ్ మ్యాచ్ విజేతతో తలపడనున్నాడు.
The first Indian man in 3️⃣5️⃣ years to beat a seed at a Grand Slam 🇮🇳@nagalsumit • #AusOpen • #AO2024 • @Kia_Worldwide • #Kia • #MakeYourMove pic.twitter.com/SY55Ip4JaG
— #AusOpen (@AustralianOpen) January 16, 2024
ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిడ్రా సాధించడం కోసం నాగల్ చాలా కష్టపడ్డాడు. క్వాలిఫయర్స్‌లో సత్తా చాటి టోర్నీలో అడుగుపెట్టాడు. ఎందుకంటే..? ఏడాది కాలంగా నిలకడగా రాణించినప్పటకీ భారత టెన్నిస్ సంఘం నగాల్‌కు వైల్డ్ కార్డు ఇవ్వలేదు. అయినా సరే నిరుత్సాహపడకుండా క్వా లిఫయర్స్లో వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచాడు. కీలకమైన చివరి రౌండ్లో స్లొవేకియాకు చెందిన అలెక్స్ మొల్కాన్(Alex Molcan)పై అలవోకగా గెలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. 2021 తర్వాత సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌లో ఇతడికి ఇది రెండో మెయిన్ డ్రా కావడం విశేషం.