Virat Kohli : ప్రపంచ క్రికెట్లో పరుగుల వీరుడిగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో ప్రపంచ కప్ వేటకు సిద్ధమవుతున్నాడు. సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో చితక్కొట్టిన విరాట్.. జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024)లో తన మేనియా చూపించేందుకు తహతహలాడుతున్నాడు.
దాదాపు 14 నెలల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన ఈ ఛేజ్ మాస్టర్.. మెగా టోర్నీలో టీమిండియా ట్రంప్ కార్డు అవుతాడని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. టెస్టులు, వన్డేల్లో రికార్డులు సృష్టిస్తున్న ఈ దిగ్గజ క్రికెటర్ ట్రాక్ రికార్డు తిరగేస్తే వాళ్ల మాటల్లో నిజం ఉందని అర్థమవుతుంది.
Virat Kohli in winning cause in T20is:
Innings – 70.
Runs – 2,828.
Average – 67.33.
Strike Rate – 139.44.
Fifties – 26.
Hundreds – 1. pic.twitter.com/xNIQl1dKa4— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024
ఫార్మాట్ ఏదైతేనేం ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి బౌలర్‌నైనా ఒత్తిడిలోకి పడేయగల టెక్నిక్, తెగువ విరాట్ సొంతం. అందుకనే అతడికి రికార్డులు దాసోహమవుతున్నాయి. ఈ స్టార్ బ్యాటర్ ఇప్పటివరకూ టీ20ల్లో ఆడింది 70 ఇన్నింగ్స్‌లే. అయినప్పటికీ 67.33 సగటు, 139.44 స్ట్రైక్ రేటుతో 2,828 పరుగుల సాధించాడు. అతడి ఖాతాలో 26 హాఫ్ సెంచరీలు, ఒక శతకం ఉన్నాయి.
టీ20ల్లో తొలి సెంచరీ కొట్టాక కోహ్లీ ఆనందం
రెండేండ్ల క్రితం ఆసియా కప్(Asia Cup 2022)లో ఫామ్ అందుకున్న కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. ఇక మెల్బోర్న్ స్టేడియంలో దాయాది పాకిస్థాన్(Pakistan)పై విరాట్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి ఖాయమనుకున్న దశలో గేర్ మార్చిన కింగ్.. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు.
కోహ్లీ, హ్యారిస్ రౌఫ్
హ్యారిస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్లో ఆఖరి రెండు బంతుల్ని అతడు సిక్సర్లుగా మలిచిన తీరు క్రికెట్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. వయసు పెరుగుతున్నా సరే యువకులతో పోటీపడుతూ నిలకడగా రాణిస్తున్నాడు. జూన్‌లో వెస్టిండస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న పొట్టి ప్రంపచకప్‌లో కోహ్లీ కీలకం కానున్నాడు. అండర్ – 19 వరల్డ్ కప్ హీరోగా జట్టులోకి వచ్చిన విరాట్.. కెరీర్ చివర్లో మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలని యావత్ భారతావని కోరుకుంటోంది.