Headingley Test : ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్(30) అరంగేట్రం టెస్టులో నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ స్వల్ప స్కోర్‌కే ఔటయ్యాడీ కుర్రాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చిన సాయి.. కేఎల్ రాహుల్(46)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చకచకా వికెట్ల మధ్య పరుగెడుతూ స్కోర్ బోర్డు పెరగడంలో సాయమందించాడు.
అయితే.. బెన్ స్టోక్స్ ఓవర్లో డిఫెన్స్ ఆడి వెనుదిరిగాడు. అతడు ఆడిన బంతి నేరుగా వెళ్లి మిడ్వికెట్లో ఉన్న క్రాలే చేతుల్లో పడింది. దాంతో, 82 వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రాహుల్ జతగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(4) ఆడుతున్నాడు. భారత్ 92 పరుగుల ఆధిక్యంలో ఉంది.
KL Rahul 🤝 Sai Sudharsan
5⃣0⃣-run stand ✅#TeamIndia move closer to the 70-run mark!
Updates ▶️ https://t.co/CuzAEnAMIW #ENGvIND | @klrahul | @sais_1509 pic.twitter.com/yCOudhVV1y
— BCCI (@BCCI) June 22, 2025
హెడింగ్లే టెస్టులో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(5-83) విజృంభణతో రెండో సెషన్లోనే ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఓలీ పోప్(106), హ్యారీ బ్రూక్(99)రాణించడంతో భారీ స్కోర్ దిశగా పయనించిన ఇంగ్లండ్‌ను ప్రసిధ్ కృష్ణ గట్టి దెబ్బకొట్టాడు. ఆ తర్వాత బుమ్రా తన పేస్ పవర్ చూపిస్తూ టెయిలెండర్లను పెవిలియన్ చేర్చాడు. దాంతో స్టోక్స్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకే పరిమితమైంది. భారత్‌కు 5 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.