Stuart Broad : ఇంగ్లండ్ దిగ్గజం స్టువార్ట్ బ్రాడ్ (Stuart Broad)కు అరుదైన గౌరవం దక్కింది. ఫాస్ట్ బౌలర్‌గా ఇంగ్లండ్ క్రికెట్‌కు విశేష సేవలందించినందుకుగానూ ఒక స్టేడియంలోని ఎండ్‌కు బ్రాడ్ పేరును పెట్టారు. గురువారం స్వయంగా తన చేతులతో ఆ ఎండ్‌ను ప్రారంభించిన వెటరన్ పేసర్ ఎంతో పులకించిపోయాడు.
జూలై 18వ తేదీన వెస్టిండీస్‌తో రెండో టెస్టు ఆరంభానికి ముందు.. ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో బ్రాడ్ తన పేరు ఖరారు చేసిన ఎండ్‌ను ఆవిష్కరించాడు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో నాకెంతో ఇష్టమైన ప్రదేశంలో దక్కిన గొప్ప గౌరవమిది అని బ్రాడ్ అన్నాడు.
క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ ప్రపంచానికి ఎందరో గొప్ప క్రికెటర్లను అదించింది. వాళ్లలో మాజీ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ ఒకడు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన బ్రాడ్ గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
A huge honour at one of my favourite places in the world 🙌 https://t.co/JpAh0tsMcI
— Stuart Broad (@StuartBroad8) July 17, 2024
టెస్టు క్రికెట్లో మేటి బౌలర్‌గా పేరొందిన బ్రాడ్ 167 మ్యాచుల్లో 604 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈమధ్యే ఆటకు అల్విదా పలికిన జేమ్స్ అండర్సన్ 704 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.