AAIMIM Chief | అంటరానితనం ప్రోత్సహిస్తోన్న యూపీ సర్కార్ : అసదుద్దీన్ ఓవైసీ
AIMIM Chief : ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అంటరానితనాన్ని ప్రోత్సహిస్తోందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
AIMIM Chief : ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అంటరానితనాన్ని ప్రోత్సహిస్తోందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. యూపీ పోలీసులు ముజ్‌ఫర్‌పూర్‌లో కన్వర్ యాత్ర మార్గంలో దారిపొడవునా వీధివెంబడి దుకాణాలు, హాటల్స్ యజమానుల పేర్లను ప్రదర్శించాలని కోరుతున్నారని అన్నారు. ఒక వర్గం లక్ష్యంగా యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని యూపీ సర్కార్ వ్యవహరించడం సరైంది కాదని ఓవైసీ హితవు పలికారు.
ఇది రాజ్యాంగంలో అంటరానితనాన్ని ప్రస్తావించే ఆర్టికల్ 17 ఉల్లంఘన కిందకు వస్తుందని, దీన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. యూపీ ప్రభుత్వం తన చేష్టల ద్వారా అంటరానితనాన్ని ప్రోత్సహించడం అమానుషమని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
యూపీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి ముజఫర్‌నగర్‌లోని దుకాణాలన్నింటిలో ముస్లిం ఉద్యోగులను తొలగించారని అన్నారు. మీరు ఒకే ఒక వర్గం కోసం పనిచేస్తారా..రాజ్యాంగానికి ఇక చోటెక్కడిదని ప్రశ్నించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు దమ్ముంటే లిఖితపూర్వక ఆదేశాలు జారీచేయాలని ఓవైసీ సవాల్ విసిరారు.
Read More :
DSC Exam| ప్రారంభమైన డీఎస్సీ.. రెండు సెషన్లలో పరీక్షలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

