YS Jagan | ఏపీలో జరుగుతున్న హింసపై కేంద్రం విచారణ జరపాలి : వైఎస్ జగన్
YS Jagan | ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరిపించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
అమరావతి : ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ(Central Enquiry) జరిపించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) డిమాండ్ చేశారు. ఏపీలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ(Narendra Modi), హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) లకు ట్వీట్ ద్వారా జగన్ కోరారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా కనిపించడంలేదని ఆరోపించారు.
వైసీపీని అణగదొక్కడమే లక్ష్యంగా అధికార పార్టీ శ్రేణులు దారుణాలకు పాల్పడుతున్నారని, రాజకీయ కక్షతో దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన హత్య రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ (Redbook) రాజ్యాంగం అమలవుతోందని , ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. . దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని విమర్శించారు.
కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నెలన్నర రోజులలోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని సూచించారు. బాధితులకు పార్టీ తరఫున అండగా నిలబడతామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
Read more :
Tension | వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి.. పుంగనూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

