అమరావతి : టీడీపీ దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలకు పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి (YCP MP Mithun Reddy) పై గురువారం చిత్తూరు (Chittur) జిల్లా పుంగనూర్‌లో దాడి జరిగింది. గురువారం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి రాకను తెలుసుకున్న టీడీపీ (TDP) శ్రేణులు రెడ్డపై ఇంటిపై రాళ్లతో దాడులకు దిగారు. దీంతో వైసీపీ శ్రేణులు సైతం ప్రతిదాడికి దిగడంతో ఉద్రిక్త (Tension) వాతావరణం ఏర్పడింది. పరస్పర దాడిని ఆపేందుకు వెళ్లిన పోలీసులకు(Police) సైతం గాయాలయ్యాయి.
ఎంపీ మిథున్‌రెడ్డి, వైసీపీ నాయకుల వాహనాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. పోలీసులు ముందు జాగ్రర్త చర్యగా ఎంపీ మిథున్‌రెడ్డిని బయటకు వెళ్లవద్దని సూచించారు. ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ డైరెక్షన్లోనే పుంగనూర్‌లో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులపై వరుస దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించే వాతావరణం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి (Gurumurthy ) మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని గుర్తించుకోవాలని సూచించారు.