Richa Chadha & Ali Fazal మీర్జాపూర్ ఫేమ్, బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి బాలీవుడ్ నటి రిచా చద్దా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అలీ ఫజల్ – రిచా దంపతులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
బాలీవుడ్లో వచ్చిన ఫక్రే సినిమాలో కలిసి నటించారు రిచా చద్దా, అలీ ఫజల్. ఈ సినిమా అనంతరం వీరి స్నేహం ప్రేమగా మారింది. దాదాపు 9 ఏళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2021లో రిజిస్టార్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడ అనౌన్స్ చేయలేదు. ఇక కోవిడ్ అనంతరం 2023లో తాము రిలేషన్లో ఉన్నామని అధికారికంగా ప్రకటించి మరోసారి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నంట్ అని వెల్లడించిన రిచా తాజాగా జూలై 16న కుమార్తె జన్మించినట్లు వెల్లడించింది. ఇక రిచా రీసెంట్గా హీరామండి ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్‌తో హిట్ అందుకోగా.. అలీ ఫజల్ మీర్జాపూర్ సీజన్3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Also Read..