భారీ చిత్రాల దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన భారతీయుడు-2 ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ పొందలేక పోయింది. ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రం అభిమానుల అంచనాలను రీచ్ అవ్వలేక పోయింది. కథానాయకుడు కమల్ హాసన్ కెరీర్ లో ఈ సినిమా డిజాస్టర్ అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ గురించి.
శంకర్ దర్శకత్వం వహించి తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం పూర్తి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మిస్తున్నామని దర్శకుడు శంకర్ వెల్లడించారు. కాగా శంకర్ ఒకవైపు భారతీయుడు -2 మరోవైపు గేమ్ ఛేంజర్ చిత్రాలను సైమల్టైనిస్గా చిత్రీకరించారన్న విషయం తెలిసిందే. భారతీయుడు -2 డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు మెగా అభిమానులందరికి ఒకింత ఆందోళన మొదలైంది. భారతీయుడు -2 ప్రభావం గేమ్ ఛేంజర్ పై ఎంతవరకు ఉంటుందో అని నిర్మాత దిల్ రాజు కు కూడా చిన్నపాటి ఉత్కంఠగా ఉన్నారని సమాచారం.
రెండు చిత్రాలకు ఒకేసారి సమాంతరంగా పనిచేయడం వల్ల సినిమా క్వాలిటీ అంతగా బాగా రాదనే చెబుతున్నారు విశ్లేషకులు. కాకపోతే కొంత మంది సినీ వర్గాలు మాత్రం రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్ ` తరువాత చేస్తున్న చిత్రం ఇది , ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు,ఈ సినిమా ఒక మాస్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి సినిమా సూపర్ హిట్ అవుతుందని మెగాఅభిమానుల అభిప్రాయం. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించగా కియారా అడ్వాణి హీరోయిన్ ,అంజలి ,ఎస్ జే ,సూర్య,శ్రీకాంత్ ,సునీల్ ,సముద్రఖనీ,తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇంత మంది ప్రముఖులున్న ఈ గేమ్ ఛేంజర్ మంచి విజయాన్ని సాధిస్తుందని సినీ వర్గాల సమాచారం.
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ
Shivam Bhaje | అశ్విన్ బాబు శివం భజే నుంచి రామ్ రామ్ ఈశ్వరం సాంగ్
Sai Pallavi | సాయిపల్లవికి తండేల్ టీం శుభాకాంక్షలు.. స్టిల్స్ వైరల్