న్యూఢిల్లీ: వీధిబాలల క్రికెట్ ప్రపంచకప్ (ఎస్‌సీసీడబ్ల్యూసీ) 2023లో భారత్‌లో జరుగనుంది. ప్రపంచబ్యాంక్, ఐసీసీ, బ్రిటీశ్ హై కమిషన్‌తో కలిసి స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్, సేవ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. 16 దేశాల నుంచి మొత్తం 22 జట్లు పోటీ పడనున్న ఈ టోర్నీ 2023 సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. 2019లో లండన్ వేదికగా జరిగిన ఈ క్రీడా టోర్నీ విజయవంతమైంది. 8 జట్లు పోటీ పడగా.. భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది.