దుబాయ్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఔటయ్యాడు. భారత్తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో 96 బంతుల్లో అతను 73 రన్స్ చేసి నిష్క్రమించాడు. అతని ఇన్నింగ్స్లో నాలుగు బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. భారత పేసర్ షమీ బౌలింగ్లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) సెమీఫైనల్లో ఇండియా కీలకమైన దశలో వికెట్ను తీసింది. చాలా సమయస్పూర్తితో ఆడిన స్మిత్.. ఓ భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చి బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చీ రాగానే అక్షర్ బౌలింగ్లో సిక్సర్ కొట్టిన మ్యాక్స్వెల్.. .. ఆ తర్వాత బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా 38 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసింది. అలెక్స్ క్యారీ క్రీజ్లో ఉన్నాడు.
Steve Smith ✅
Glenn Maxwell ✅One brings two! 🔥🔥
Timber strikes courtesy of Mohd. Shami and Axar Patel!
Updates ▶️ https://t.co/HYAJl7biEo#TeamIndia | #INDvAUS | #ChampionsTrophy pic.twitter.com/lEcZlRWhOn
— BCCI (@BCCI) March 4, 2025