T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా(USA)లో క్రికెట్ ఫీవర్ మొదలైంది. న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన నస్సౌ కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లకు అభిమానులు పోటెత్తుతున్నారు. పైగా తొలి మ్యాచ్‌లోనే అమెరికా జట్టు కెనడా(Canada)పై సూపర్ విక్టరీ కొట్టింది. దాంతో, ఈ మెగా టోర్నీకి మరింత ఆదరణ కల్పించడం కోసం ఐసీసీ వినూత్నంగా ఆలోచించింది.
వరల్డ్ కప్ గురించి స్థానిక వార్త పత్రికలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది. అందులో న్యూయార్క్‌లోని అద్బుత కట్టడమైన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'(Statue Of Liberty) చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఉంది. ఆ ప్రకటన చూసిన వాళ్లంతా అమెరికాలో క్రికెట్ ఇప్పుడు ఆకాశమంత ఎత్తుకు చేరింద అని అనుకుంటున్నారు.
Nothing like a print ad (in the @nytimes no less) to solidify the arrival of cricket in America! pic.twitter.com/3RHsExqNpH
— Satyan Gajwani (@satyan) June 2, 2024
పొట్టి ప్రపంచ కప్ 9వ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య అమెరికా (USA) చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన మూడో జట్టుగా రికార్డు నెలకొల్పింది. పొరుగు దేశం కెనడా(Canada)పై అరోన్ జోన్స్(94 నాటౌట్) 10 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో, అమెరికా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో వెస్టిండీస్(West Indies) పసికూన పపువా న్యూ గినియాను చిత్తు చేయగా.. సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో నమీబియా జట్టు ఒమన్‌పై అద్భుత విజయం సాధించింది.
Delivering in all facets of the game 👏
The Namibia talisman, David Wiese, takes home the @aramco POTM after his heroic effort led his side to victory over Oman 🎖️#T20WorldCup #NAMvOMA pic.twitter.com/0mbPjRLaa8
— ICC (@ICC) June 3, 2024