OMG Movie | రీసెంట్గా చారి 111 అంటూ స్పై జానర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఇప్పుడు హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్నాడు. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఓఎమ్‌జీ (OMG) ఓ మంచి గోస్ట్ అనేది ట్యాగ్ లైన్. నందితా శ్వేతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో షకలక శంకర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ అబినికా ఇనాబతుని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌తో పాటు టీజర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను జూన్ 14, 2024న విడుదల చేయనున్నట్లు తెలిపారు. నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.