హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ): నేషనల్ షూటింగ్ చాంపియన్షిప్-24లో సత్తా చాటిన తెలంగాణ పోలీసు షూటర్స్ను రాష్ట్ర డీజీపీ జితేందర్ అభినందించారు. శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయం లో వారికి పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు.
జాతీయ షూటిం గ్ పో టీల్లో 25మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో నారాయణదాసు, రైఫి ల్ ప్రోన్ వ్యక్తిగత కేటగిరీలో సువర్ణ కాంస్య పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేశ్ భగవత్, స్పోర్ట్స్ ఐజీజీ రమేశ్ పాల్గొన్నారు.