SRH vs KKR : అహ్మదాబాద్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరుగుతున్నాడు. అతడి ధాటికి వచ్చిన వాళ్లు వచ్చినట్టు డగౌట్‌కు క్యూ కడుతున్నారు. తొలి ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(0) సున్నాకే బౌల్డ్ చేసిన స్టార్క్.. ఆ తర్వాత ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(0)ని, ఆల్‌రౌండర్ షహ్బాజ్ అహ్మద్(0)ను వరుస బంతుల్లో వెనక్కి పంపి సన్‌రైజర్స్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా.. రాహుల్ త్రిపాఠి(24) ధనాధన్ ఆడుతున్నాడు. అతడికి జతగా చేరిన హెన్రిచ్ క్లాసెన్(5) సైతం దూకుడు పెంచాడు. దాంతో, సన్‌రైజర్స్ 6 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 45 రన్స్ కొట్టింది. ఈ ఇద్దరూ ఎంతసేపు నిలబడతారు? అనేదానిపై హైదరాబాద్ స్కోర్ ఆధారపడి ఉంది.