ICC : అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రికెటర్లకు ప్రోత్సాహకంగా ఐసీసీ నెలనెలా అవార్డులు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ Mitchell Starc) ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుపొందాడు. ఈమధ్యే ముగిసిన యాషెస్ సిరీస్‌లో 31 వికెట్లతో చెలరేగిన స్టార్క్ డిసెంబర్ నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సాధించాడు. మహిళల విభాగంలో వరల్డ్‌కప్ స్టార్ లారా వొల్వార్డ్త్ (Laura Wolvaardt) విజేతగా నిలిచింది.
డిసెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ కోసం పురుషుల విభాగంలో మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫ్ఫీ, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ పోటీ పడ్డారు. యాషెస్ సిరీస్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన మిస్సైల్ స్టార్క్ రెండు అర్ధ శతకాలు బాదడమే కాకుండా 31 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. దాంతో.. మాజీ ఆటగాళ్లు, అభిమానులు స్టార్క్‌కే ఓటేశారు. కివీస్‌పై డబుల్ సెంచరీతో సత్తా చాటిన గ్రీవ్స్ నామినేషన్ దక్కించుకున్నాడు. వెస్టిండీస్ బ్యాటర్లను వణికించిన డఫ్ఫీ 23 వికెట్లతో మెరిసి.. రెండు టెస్టుల సిరీస్‌ను వైట్‌వాష్ చేయడంలో కీలక పాత్ర పోషించడంతో రేసులోకి వచ్చాడు.
For his heroics in Australia’s Ashes triumph, Mitchell Starc has been crowned the ICC Men’s Player of the Month for December 2025 ⚡
Read more 👉 https://t.co/rLedvRXAq6 pic.twitter.com/5sJXrCiZKt
— ICC (@ICC) January 15, 2026
OH MY WORD WHAT A SEED FROM MITCH STARC!#Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/1z4idDsklT
— cricket.com.au (@cricketcomau) December 19, 2025
మహిళల విభాగంలో భారత ఓపెనర్ షఫాలీ వర్మ, లారా వొల్వార్డ్త్, సునే లుస్ పోటీ పడ్డారు. కానీ, వరల్డ్‌కప్ ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డేల్లో వరుస శతకాలు బాదిన సఫారీ కెప్టెన్ విజేతగా నిలిచింది. ఇటీవలే మూడు వన్డేల సిరీస్‌లో లారా 205.35 స్ట్రయిక్ రేటుతో 255 పరుగులు చేసినందుకు ప్రోత్సాహకంగా ఈ అవార్డుకు ఎంపికైంది. ఇటీవలే సొంతగడ్డపై శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసిన షఫాలీకి ఈసారి నిరాశే మిగిలింది. ఐదు టీ20ల సిరీస్‌లో ఆకాశమే హద్దుగా ఆడిన షఫాలీ.. 181.20 స్ట్రయిక్ రేటుతో 241 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రిక ఆల్‌రౌండర్ సునే లుస్ 205 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో నిలిచినా.. లాభం లేకపోయింది.
Captain Fantastic does it again! 🌟#TheProteas captain Laura Wolvaardt has been crowned ICC Women’s Player of the Month for December 2025 👑
That’s two Player of the Month awards in just three months, a remarkable achievement from a leader who continues to set the standard for… pic.twitter.com/8lI58OkOz2
— Proteas Women (@ProteasWomenCSA) January 15, 2026