Blood Camp : శ్రీరామ్ గ్రూప్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శనివారం దేవి రోడ్డులోని బ్రాంచ్లో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తాదానం మహాదానమని, రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడొచ్చని నిర్వాహకులు తెలిపారు.
రక్తదాన శిబిరంలో.. DMHO సిబ్బంది, శ్రీరామ్ గ్రూప్ అధికారులు భాస్కర్ రావు, రాము, రాజేందర్, రాజ్ కుమార్, శ్రీనివాస చారి, తానజీ, భాస్కర్ రెడ్డి, సతీష్, సాయిబాబా, ఉమేష్, రాజు, పురుషోత్తం, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా50 యూనిట్ల రక్తం సేకరించామని GGH మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కావ్య తెలిపారు.
