Wimbledon : వింబుల్డన్‌లో భారత స్టార్స్ ఆశలు రేకెత్తిస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (Sriram Balaji) ముందంజ వేశాడు. గురువారం జరిగిన తొలి రౌండ్లో శ్రీరామ్- మిగెల్ రెయ్స్(మెక్సికో) ద్వయం అమెరికా జంటను చిత్తు చేసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో లెర్నర్ థియెన్, అలెగ్జాండర్ కొవసెవిక్ ద్వయంపై 6-4, 6-4తో జయకేతనం ఎగురవేసింది. దాంతో, ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు శ్రీరామ్.
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో యుకీ బాంబ్రీ, రిత్విక్ బొల్లిపల్లిలు రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇప్పుడు శ్రీరామ్ కూడా తొలి రౌండ్ దాటడంతో ఈ ముగ్గురిలో ముందడుగు వేస్తారో చూడాలి. రెండో రౌండ్లో శ్రీరామ్ ద్వయం నాలుగో సీడ్‌తో తలపడనుంది.
BALAJI/REYES-VARELA ENTER WIMBLEDON ROUND 2 💪
✅ The duo earned a facile straight-set win over American pair of Kovacecic/Tien
✅ 1st win at Wimbledon for Balaji since 2018 (w. Vardhan)
✅ Will take on 4th seeds 🇪🇸Granollers/🇦🇷Zeballos next[R64] 🇮🇳Balaji/🇲🇽Reyes-Varela d.… pic.twitter.com/CBnUskcmE2
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) July 3, 2025
అయితే.. భారత లెజెండరీ ఆటగాడు రోహన్ బోపన్న మాత్రం అనూహ్యంగా నిష్క్రమించాడు. అనుభవజ్ఞుడైన అతడు అలవోకగా గెలుస్తాడనుకుంటే తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. బెల్జియం ఆటగాడు సాండర్ జెల్లీతో ఆడిన బోపన్న జర్మనీ జంట చేతిలో 6-3, 6-4తో పరాజయం పాలయ్యాడు.