ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు.. సభాస్థలాన్ని పరిశీలించిన ఎన్నారై గ్లోబల్ బీఆర్ఎస్ కోఆర్డినేటర్
డల్లాస్‌లో జరిగిన బీఆర్ఎస్ గ్రాండ్ ఈవెంట్ అత్యంత విజయవంతంగా సాగినందుకు మహేష్ బిగాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఘన విజయాన్నిబట్టి, ఈసారి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూకె, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, గల్ఫ్ ప్రాంతాల్లో జరపడానికి భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఆస్ట్రేలియా, మెల్బోర్న్: డల్లాస్‌లో జరిగిన బీఆర్ఎస్ గ్రాండ్ ఈవెంట్ అత్యంత విజయవంతంగా సాగినందుకు మహేష్ బిగాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఘన విజయాన్నిబట్టి, ఈసారి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూకె, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, గల్ఫ్ ప్రాంతాల్లో జరపడానికి భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఆస్ట్రేలియాలో మహేష్ బిగాలా స్థానిక బీఆర్ఎస్ టీమ్ సభ్యులతో కలిసి మెల్బోర్న్లోని కొన్ని వేదికలను పరిశీలించారు. ఆయనతో పాటు యువ విభాగం నేత సన్నీ గౌడ్, మరికొందరు సభ్యులు కూడా ఉన్నారు. భవిష్యత్తులో బిఆర్ఎస్ రజతోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపాలని వివిధ దేశాల నుండి అనేక అభ్యర్థనలు వస్తున్నాయని మహేష్ తెలిపారు.

వేదిక, తేదీల విషయంలో త్వరలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశం అయ్యాక అధికారికంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. మహేష్ బిగాలా మాట్లాడుతూ.. డల్లాస్‌లో మా గొప్ప విజయాన్ని ఆస్వాదించాక, మరింత ప్రగతి సాధిస్తూ, బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా జరుపుకునేందుకు కృషి చేస్తున్నాం. ఆస్ట్రేలియాలోని సహచరులు, యువ నేతలతో కలిసి ముందుకు సాగుతున్నాము అని మహేశ్ బిగాలా పేర్కొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

