Edgbaston Test : భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(205నాటౌట్) ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. లంచ్ బ్రేక్ తర్వాత జోరు పెంచిన అతడు జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. గాల్లోకి పంచ్‌లు విసురుతూ సంబురాలు చేసుకున్నాడు. అంతుకుందు టంగ్ ఓవర్లో కవర్ డ్రైవ్‌తో ఫోర్ బాదిన గిల్ 190కి చేరువైన గిల్.. అనంతరం మూడో బంతిని డీప్ స్వ్కేర్ లెగ్‌లో ఫోర్ రాబట్టాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్(22 నాటౌట్) కు ఛాన్సిచ్చిన అతడు టంగ్ ఓవర్లోనే సింగిల్‌తో కెరియర్లో తొలి డబుల్ కలను సాకారం చేసుకున్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో దంచికొడుతున్న గిల్ చిన్నవయసులోనే ద్విశతకం బాదిన భారత మూడో కెప్టెన్‌గా ఘనత సొంతం చేసుకున్నాడు. గిల్ 23 ఏళ్ల 298 రోజుల్లో ఈమైలురాయికి చేరుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్, విరాట్ కోహ్లీలను అతడి వెనకే ఉండడం విశేషం. 23 ఏళ్ల 398రోజుల్లోనే డబుల్ సెంచరీ కొట్టేసిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Leading from the front 🫡
First Indian Captain to register a double-century in Test cricket in England 👏👏
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ShubmanGill pic.twitter.com/Pm7pq7GRA9
— BCCI (@BCCI) July 3, 2025
సచిన్ 26 ఏళ్ల 189 రోజుల్లో, కోహ్లీ 27 ఏళ్ల 260 రోజుల్లో డబల్ క్లబ్లో చేరారు. మొత్తంగా ఇంగ్లండ్ నేలపై ద్విశతకం బాదిన తొలి భారత కెప్టెన్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. అజారుద్దీన్ 179 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.మొత్తంగా విదేశీ గడ్డపై రెండొందలు బాదిన ఆరో సారథిగా మరో మైలురాయికి చేరువయ్యాడీ యంగ్‌స్టర్. అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఈ ఘనత సాధించారు.