మధిర, జులై 03 : వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన మధిరలోని సాయినగర్‌లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడుపల్లికి చెందిన పారా కిశోర్, లక్ష్మి దంపతుల కుమార్తె అంజలి (21). గత ఏడాది సెప్టెంబర్ 9న సిరిపురం గ్రామానికి చెందిన తడికమల్ల రాము ను అంజలి ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరూ మధిరలోని సాయి నగర్లో నివాసం ఉంటున్నారు. కాగా గురువారం ఆమె అనుమానాస్పద రీతిలో మృతిచెంది పడి ఉంది. అంజలి తండ్రి కిశోర్ స్పందిస్తూ.. రాము తమ కుమార్తెను వివాహం చేసుకున్నప్పటి నుండి మానసికంగా, శారీరంగా వేదిస్తున్నట్లు తెలిపాడు. కుమార్తె మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మధిర వన్ టౌన్ సీఐ రమేశ్ తెలిపారు.