ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ 33వ గ్రూప్ దశ మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ కుశాల్ మెండిస్(Kushal Mendis) టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఆరు విజయాలతో జోరుమీదున్న భారత్ ఏ మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది. లంక మాత్రం ధనంజయ డిసిల్వా స్థానంలో దుషాన్ హేమంతను తీసుకుంది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, సూర్యకుమార్,, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ , షమీ, బుమ్రా, సిరాజ్.
శ్రీలంక: కుశాల్ మెండిస్(కెప్టెన్), నిస్సనక, కరుణరత్నె, సమరవిక్రమ, చరిత అసలంక, ఆంజెలో మాథ్యూస్, దుషాన్ హేమంత, కసున్ రజిత, తీక్షణ, మదుశనక, చమీర.
వరల్డ్ కప్ రికార్డులు తిరగేస్తే.. వరల్డ్ కప్లో భారత్, లంక ఇప్పటివరకూ 9 సార్లు ఎదురుపడ్డాయి. అయితే.. రెండు జట్లు చెరో నాలుగసార్లు గెలుపొందగా.. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. దాంతో, ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ దెబ్బకు 50 పరుగులకే కుప్పకూలిన లంక.. ఈసారి ఏమేరకు ప్రతిఘటిస్తుంది అనేది చూడాలి.