SL vs RSA : టీ20 వరల్డ్ కప్‌లో పెద్ద జట్ల పోటీకి వేళైంది. మెగా టోర్నీ నాలుగో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa), శ్రీలంక (Srilanka) తలపడుతున్నాయి. నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో శ్రీలంక టాస్ గెలిచింది. కెప్టెన్ వనిందు హసరంగ బ్యాటింగ్ తీసుకున్నాడు.
శ్రీలంక 7+ 4 కాంబినేషన్‌తో బరిలోకి దిగుతోంది. మరోవైపు సఫారీ జట్టు ఒకే స్పిన్నర్‌ను తీసకుంది. తొలి మ్యాచ్‌లోనే విజయంతో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్న దక్షిణాఫ్రికాకు హెన్రిక్ క్లాసెన్,.. లంకకు ఏంజెలో మాథ్యూస్ కీలకం కానున్నారు.
దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్జియా, ఒట్నీల్ బార్ట్‌మన్.
శ్రీలంక జట్టు : పథుమ్ నిస్సంకా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత అసలంక, ఏంజెలో మాథ్యూస్, దసున్ శనక, వనిందు హసరంగ(కెప్టెన్), మహీశ్ థీక్షణ, మథీశ పథిరణ, నువాన్ తుషార.