SLW vs PAKW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంక (Srilanka) మ్యాచ్ అంటే చాలు వరుణుడు వచ్చేస్తున్నాడు. ఆతిథ్య జట్టుకు స్వదేశంలో గెలిచే అవకాశం ఇవ్వకుండా అడ్డు తగులుతున్నాడు. ఇప్పటికే కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మూడు మ్యాచ్‌లు రద్దు కాగా.. మరోసారి లంక మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తోంది వర్షం. శుక్రవారం పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంలో నీళ్లు కుమ్మరించి వెళ్లాడు వరుణుడు. కాసేపటికి వర్షం తగ్గినా తడి ఔట్‌ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యం కానుంది.
ప్రపంచ కప్‌లో వర్షం దెబ్బతో శ్రీలంక, పేలవ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ సెమీస్ బెర్తును చేజార్చుకున్నాయి. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఉన్న రెండు జట్లకు ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. దాంతో.. విజయంతో టోర్నీని ముగించాలని పాక్, లంక కెప్టెన్లు పట్టుదలతో ఉన్నారు.
A familiar sight from Colombo #CWC25 pic.twitter.com/nhbKssJ7Kc
— ESPNcricinfo (@ESPNcricinfo) October 24, 2025
ఇప్పటివరకూ స్వదేశంలో ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా ఆడని చమరి ఆటపట్టు బృందం.. పాక్‌తో మ్యాచ్ అయినా నిరాటంకంగా సాగాలని కోరుకుంది. కానీ, టాస్కు ముందే ప్రేమదాస స్టేడియాన్ని వరుణుడి ముంచెత్తడంతో.. మధ్యాహ్నం3:00 గంటలకు వేయాల్సిన టాస్ వాయిదా పడింది. ఇప్పటికే గంటన్నర సమయం వృథా కావడంతో ఓవర్లు కుదించి ఆడించే అవకాశముంది.