SLW vs PAKW : మహిళల వన్డే ప్రపంచ కప్లో శ్రీలంక, పాకిస్థాన్ జట్ల చివరి మ్యాచ్ వర్షార్పణమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో టాస్కు అడ్డుపడిన వరుణుడు చివరకు మ్యాచ్ను మింగేశాడు. డక్వర్త్ లూయిస్ ప్రకారం 34 ఓవర్ల ఆటకు సిద్ధమైన పాక్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. వాన తగ్గితే మ్యాచ్ ఆడించాలని అంపైర్లు చూసినా లాభం లేకపోయింది. దాంతో.. చివరకు ఆటను రద్దు చేశారు. ఫలితంగా మెగా టోర్నీని విజయంతో ముగించాలని ఆశపడిన ఇరుజట్లకు నిరాశే మిగిలింది.
శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ టాస్కు ముందే వర్షం మొదలైంది. దాంతో.. రెండున్నర గంటల సమయం వృథా
కావడంతో, 34 ఓవర్ల మ్యాచ్ ఆడించాలని భావించారు. 17:45 గంటలకు టాస్ వేయగా లంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్ తీసుకుంది. ప్రపంచ కప్లో బోణీ కొట్టని పాక్ భారీ స్కోర్ చేసి లంకకు సవాల్ విసరాలని అనుకుంది. కానీ.. ఐదో ఓవర్ తొలి బంతి పడిందో లేదో మళ్లీ వాన అందుకుంది. దాంతో.. అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి పాక్ స్కోర్.. 18-0.
The final World Cup game in Colombo…is also called off 🌧️ pic.twitter.com/Iibri6ZlWW
— ESPNcricinfo (@ESPNcricinfo) October 24, 2025
చివరి మ్యాచ్ కాబట్టి విజయంతో టోర్నీని ముగించాలని భావించిన పాక్ జట్టు.. స్వదేశంలో విక్టరీ కొట్టాలనుకున్న లంక క్రికెటర్లతో పాటు అభిమానులు దేవుడిని ప్రార్ధించినా ఫలితం లేకపోయింది. దాంతో.. మ్యాచ్ను రద్దు చేసి చెరొక పాయింట్ కేటాయించారు అంపైర్లు. మ్యాచ్ రద్దుతో తీవ్ర అసంతృప్తికి లోనైన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఐసీసీకి కీలక విన్నపం చేసింది. ‘ప్రపంచ కప్లో వాతావరణం మాకు అనుకూలించలేదు. ఇంగ్లండ్తో మ్యాచ్లో విజయావకాశాలు ఉన్నవేళ వర్షం దెబ్బతీసింది. మరో రెండు మ్యాచ్లు కూడా వాన కారణంగానే రద్దు కాగా కీలక పాయింట్లు కోల్పోయా. అందుకే వాన ముప్పు లేని వేదికలను ఐసీసీ ఎంపిక చేయాలి. ఎందుకంటే.. వరల్డ్ కప్ కోసం నాలుగేళ్లు నిరీక్షిస్తాం. అలాంటిది మ్యాచ్లు ఫలితం తేలకుండా రద్దయితే ఎంతో నష్టపోతాం’ అని ఫాతిమా మ్యాచ్ అనంతరం చెప్పింది.
‘The ICC must arrange good venues for the World Cup’
3 of Pakistan’s 7 World Cup games in Colombo were washed out 🌧️ pic.twitter.com/dgce5rcCjG
— ESPNcricinfo (@ESPNcricinfo) October 24, 2025
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్య జట్టు శ్రీలంక పాలిట విలన్ అయింది. ఐదింట్లో ఒకే ఒక మ్యాచ్ సాగగా.. మిగతా నాలుగు వర్షా్ర్ఫణం అయ్యాయి. దాంతో.. సెమీస్ అవకాశాన్ని చేజార్చుకుంది ఆటపట్టు బృందం. అక్టోబర్ 4న ఆస్ట్రేలియాతో జరగాల్సిన తొలి మ్యాచ్ టాస్ పడకుండానే రద్దు కాగా.. అనంతరం అక్టోబర్ 14న న్యూజిలాండ్తోనూ ఒకే ఇన్నింగ్స్ సాధ్యమైంది. అక్టోబర్ 18న ఇంగ్లండ్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా వాన దెబ్బకు రద్దు అయింది.
వరుస విజయాలతో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సెమీస్ చేరగా.. టీమిండియాతో పాటు సెమీస్ రేసులో ఉన్న పాక్, న్యూజిలాండ్ జట్లకు వరుణుడు షాకిచ్చాడు. చివరి లీగ్ మ్యాచ్లో విజయంపై ఆశలు పెట్టుకున్న శ్రీలంకను మరోసారి వర్షం దెబ్బకొట్టగా.. షేరింగ్ పాయింట్లతోనే పాక్ టోర్నీని ముగించాల్సి వచ్చింది.