Asia Cup 2023 : డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక(Srilanka)ను బౌలింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఆసియా కప్(Asia Cup 2023) ముందు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా(Kusal Perera) కరోనా బారిన పడ్డారు. దానికి తోడూ ఆ జట్టు స్టార్ బౌలర్లు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు టోర్నీకి దూరమయ్యారు. లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga), పేసర్లు దుష్మంత చమీర(Dushmantha Chameera), లహిరు మధుశనక(Lahiru Madushanka), లహిరు కుమార(Lahiru Kumara)లు గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. దాంతో, వీళ్ల స్థానంలో బినుర ఫెర్నాండో, ప్రమోద్ మదుషాన్లకు సెలెక్టర్లు 17 మంది బృందంలోకి తీసుకున్నారు.
ఆసియా కప్‌లో శ్రీలకం బౌలింగ్ యూనిట్‌కు కసున్ రజిత నాయకత్వం వహించే అవకాశం ఉంది. లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌తో ఐపీఎల్ 16వ సీజన్లో చెలరేగిన మథీశ పథిరన కూడా ఓ చేయి వేయనున్నాడు. ఇక స్పిన్ భారమంతా మహీశ్ థీక్షణపై పడనుంది. మొత్తంగా చూస్తే. లంక అనుభవం లేని బౌలర్లతో బరిలోకి దిగనుంది.
🚨 BREAKING: Sri Lanka will be without the services of four key bowlers at the 2023 Asia Cup.
Full squad 👇
— ICC (@ICC) August 29, 2023
దాంతో అతిథ్య జట్టు ఈసారి కప్పు కొట్టడం అటుంచి సెమీస్ చేరడమే గొప్ప అనిపిస్తోంది. సొంత గడ్డపై నిరుడు జరిగిన ఆసియా కప్‌లో దసున్ షనక సారథ్యంలోని లంక చాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి ట్రోఫీని అందుకుంది.
శ్రీలంక బృందం : దసున్ శనక(కెప్టెన్), ప్రథుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ జనిత్ పెరీరా, కుశాల్ మెండిస్(వైస్ కెప్టెన్), చరిత అసలంక, ధనంజయ డిసిల్వా, సదీర సమరవిక్రమ, మహీశ్ థీక్షణ, దునిత్ వెల్లలాగే, మథీశ పథిరన, కసున్ రజిత, దుషాన్ హేమంత, బినుర ఫెర్నాండో, ప్రమోద్ మదుషాన్.
అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా
ఈసారి హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఆసియా కప్ పోటీలకు శ్రీలంక, పాక్ ఆతిథ్యం ఇస్తున్నాయి. వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీ అన్ని జట్లకు వరల్డ్ కప్ సన్నద్ధతగా ఎంతో ఉపయోగపడనుంది. రేపు జరిగే ఆరంభ మ్యాచ్‌లో పాక్, నేపాల్ ఢీ కొననున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ సెప్టెంబర్ 2న తలపడనున్నాయి.