ODI WC 2023 : వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్(Pakistan) జట్టు కొత్త జెర్సీ(New Jersey)తో బరిలోకి దిగనుంది. అవును.. పాక్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) నిన్న కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ సందర్భంగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్(Zaka Ashraf) మాట్లాడుతూ.. పాక్ క్రికెట్ హీరోలకు, వాళ్లకు మద్దతుగా నిలిచే కోట్లాది మంది అభిమానుల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా కొత్త జెర్సీ ఉంది. దీని మీది ప్రతి స్టార్.. పాకిస్థాన్ క్రికెట్ విజయాలను సూచిస్తుంది. అంతేకాదు మా దేశ ఘనమైన క్రికెట్ వారసత్వానికి ప్రత్రీకగా, భావితరాల్లో స్ఫూర్తి నింపే వెలుగు దివ్వెలా ఉంది అని అన్నాడు.
అనంతరం పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ ఆఫ్రీదీ( Shaheen Afridi) కొత్త జెర్సీ వేసుకొని ఫొటోలకు పోజిచ్చాడు. ఇంతకు ముందు జెర్సీ కంటే ఇది చాలా ప్రత్యేకంగా ఉంది. జెర్సీ మీద లేత ఆకుపచ్చ రంగులో రెండు గీతలు ఉన్నాయి. అంతేకాదు వలర్డ్ కప్ ట్రోఫీతో పాటు ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా 2023 అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. జెర్సీ ఆవిష్కరణ ఫొటోలను పీసీబీ సోషల్‌మీడియాలో పెట్టింది. ఆ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ జెర్సీ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Star Nation Jersey 🤩
ICYMI, Pakistan have unveiled their kit for #CWC23 🏆https://t.co/q5Ye1tKfAS
— ICC (@ICC) August 29, 2023
భారత గడ్డపై అక్టోబర్ 5న వరల్డ్ కప్ షురూ కానుంది. బాబర్ ఆజాం(Babar Azam) సారథ్యంలోని పాక్ మరుసటి రోజే నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 14న టీమిండియాను ఢీ కొట్టనుంది. వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో పలుమార్లు కంగుతిన్న పాక్ ఈసారి ఎలా ఆడనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
బాబర్ ఆజాం, రోహిత్ శర్మ
అయితే.. ఈ టోర్నీకి ముందే దాయాదులు ఆసియా కప్‌లో ఎదురు పడనున్నాయి. సెప్టెంబర్ 2న శ్రీలంక వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నిరుడు నిరుడు ఆసియా కప్‌లో దాయాదులు రెండుసార్లు తలపడ్డాయి. అయితే.. చెరొకసారి పైచేయి సాధించారు. దాంతో, ఈసారి ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై అందరి కళ్లు నిలిచాయి.