Asia Cup 2023 | రేపటి నుంచి ఆసియా కప్.. అందరి కళ్లన్నీ ఈ ఆరుగురిపైనే
Asia Cup 2023 : ఉపఖండ దేశాలు మినీ వరల్డ్ కప్(Mini World Cup)గా భావించే ఆసియా కప్(Asia Cup 2023) పోటీలకు రేపటితో తెరలేవనుంది. శ్రీలంక, పాకిస్థాన్ సుంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నఈ టోర్నీలో మెరిసేది ఎవరు? విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ కొడతాడా? జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumarh) దుమ్మురేపుతాడా? వంటి ఆలోచనలు అభిమానుల మనసులో తిరుగుతున్నాయి. అయితే.. ఈసారి ఆరుగరు ఆటగాళ్లపైనే...
Asia Cup 2023 : ఉపఖండ దేశాలు మినీ వరల్డ్ కప్(Mini World Cup)గా భావించే ఆసియా కప్(Asia Cup 2023) పోటీలకు రేపటితో తెరలేవనుంది. శ్రీలంక, పాకిస్థాన్ సుంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నఈ టోర్నీలో మెరిసేది ఎవరు? విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ కొడతాడా? జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumarh) దుమ్మురేపుతాడా? వంటి ఆలోచనలు అభిమానుల మనసులో తిరుగుతున్నాయి. అయితే.. ఈసారి ఆరుగరు ఆటగాళ్లపైనే అందరి దృష్టి నెలకొంది. అందుకు కారణం లేకపోలేదు. వీళ్లలో కొందరికి ఆ టోర్నీలో ఏమంత గొప్ప రికార్డు లేదు. మరో ఇద్దరికీ ఇదే మొదటి ఆసియాకప్ .. ఇంతకు వాళ్లు ఎవరు? వాళ్ల విశేషాలు ఏంటో చూద్దాం.
మెగా టోర్నీలు అంటే చాలు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) రెచ్చిపోయి ఆడతాడు. కానీ, అతడికి ఆసియా కప్(Asia Cup)లో మెరుగైన రికార్డు లేదు. నిరుడు టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో అతను నిరాశపరిచాఉ. ఆరు ఇన్నింగ్స్‌ల్లో68 రన్స్ చేశాడంతే. దాంతో, ప్రపంచ కప్ ముందు ఈ టోర్నీలో సత్తా చాటాలని బాబర్ భావిస్తున్నాడు.
బాబర్ ఆజాం

ఈమధ్యే అఫ్గనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాక్ కెప్టెన్ టచ్‌లోకి వచ్చాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ ఏడాది వన్డే ర్యాకింగ్స్లో అగ్రస్థానం సాధించిన బాబర్‌పైనే పాక్ భారీ ఆశలు పెట్టుకుంది.
బూమ్ బూమ్ బుమ్రా
ఈసారి ఆసియా కప్‌లో భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumarh)పైనే అందరు దృష్టి పెట్టనున్నారు. దాదాపు 11 నెలల విరామం తర్వాత ఈ యార్కర్ కింగ్ రీ – ఎంట్రీ ఇవ్వడమే అందుకు కారణం. ఐర్లాండ్ సిరీస్(IrelandSeries)తో పునరాగమనం చేసిన బుమ్రా ఆకట్టుకున్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లో రెండేసి వికెట్లతో సత్తా చాటాడు.
జస్ప్రీత్ బుమ్రా

కొత్త బంతితో బ్యాటర్ల భరతం పట్టే ఈ స్టార్ పేసర్ రాకతో భారత జట్టు బలం పెరిగింది. అయితే.. ఈ టోర్నీలో బుమ్రా ఎలా రాణిస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు తన సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఈ టోర్నీ బుమ్రాకు ఎంతో ఉపయోగపడనుంది.
గుల్షన్ ఝా
నేపాల్ జట్టు(Nepal Team) తొలిసారి ఆసియా కప్ పోటీలకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ గుల్షన్ ఝా(Gulshan Jha) స్పెషల్ అట్రాక్షన్ కానున్నాడు. నెల క్రితం జింబాబ్వేలో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ (World Cup Qualifiers 2023)పోటీల్లో గుల్షన్ బ్యాటుతో, బంతితో రాణించాడు.
గుల్షన్ ఝా

ఐర్లాండ్(Ireland)పై ఈ యంగ్‌స్టర్ అటాకింగ్ గేమ్(Attacking Game)తో విరుచుకుపడి హాఫ్ సెంచరీ కొట్టాడు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్(Lower Order)లో ధనాధన్ ఆడే గుల్షన్ ఆసియా కప్‌లో తన ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
తస్కిన్ అహ్మద్
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్(Taskin Ahmed) ఆసియా కప్‌లో బౌలింగ్ యూనిట్‌కు నాయకత్వం వహించనున్నాడు. స్టార్ పేసర్ ఎబదాత్ హొసేన్(Ebadot Hossain)గాయపడడంతో మేనేజ్మెంట్ అతడికి ఈ బాధ్యతలు అప్పగించింది. గత కొంత కాలంగా తస్కిన్ బౌలింగ్‌లో అద్బుతాలు చేస్తున్నాడు.
తస్కిన్ అహ్మద్

నిలకడగా రాణిస్తూ బంగ్లా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ మధ్యే సొంత గడ్డపై అఫ్గనిస్థాన్(Afghanistan)పై 5 వికెట్లతో అదరగొట్టాడు. దాంతో, షకిబుల్ హసన్(Shakib Al Hasan) సారథ్యంలోని బంగ్లా తస్కిన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి అతను అంచనాలు అందుకుంటాడా? అనేది రేపటితో తెలియనుంది.
రషీద్ ఖాన్
ప్రపంచంలోని గొప్ప స్పిన్నర్ల జాబితాలో ఒకడైన రషీద్ ఖాన్(Rashid Khan) అఫ్గనిస్థాన్‌కు కీలకం కానున్నాడు. చెప్పాలంటే అతడి సక్సెస్ పైనే అఫ్గనిస్థాన్ గెలుపు ఆధారపడి ఉంది. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో వికెట్ల వేట కొనసాగించిన రషీద్ బంగ్లాదేశ్‌పై తేలిపోయాడు. పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లోనూ ఈ స్టార్ స్పిన్నర్ ప్రభావం చూపలేకపోయాడు.
రషీద్ ఖాన్

ఈ ఏడాది 13 టీ20లు ఆడిన రషీద్ 13 వికెట్లు తీశాడంతే. అలాగని.. అతడిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఈ లెగ్ స్పిన్నర్ ఒక్క ఓవర్లోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్ధుడు. ఇప్పటికే పలుమార్లు రషీద్ అనూహ్యంగా కమ్‌బ్యాక్ చేశాడు. బ్యాట్‌తోనూ రాణించగల రషీద్ ఆసియా కప్‌లో ఎలా ఆడతాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మహీశ్ థీక్షణ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga) ఫిట్నెస్ సాధించలేదు. దాంతో యువకుడైన మహీశ్ థీక్షణ(Maheesh Theekshana)పై భారం పడనుంది. థీక్షణ ఐపీఎల్ 16వ సీజన్లో అద్భుతంగా రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరఫున 13మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో 3 వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు.
మహీశ్ థీక్షణ

వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(World Cup Qualifiers 2023)లో 21 వికెట్లతో చెలరేగాడు. అంతేకాదు స్వదేశంలో జరిగిన లంక ప్రీమియర్ లీగ్ 7 వికెట్లు పడగొట్టాడు. ఈసారి సొంత గడ్డపై తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించేందుకు ధీక్షణ సిద్ధమవుతున్నాడు.
ఇవి కూడా చదవండి
Rishabh Pant | గ్రిప్.. ట్విస్ట్.. పాడిల్.. రిషబ్ పంత్ సైక్లింగ్ వీడియో వైరల్
KL Rahul | ఆసియా కప్‌కు ముందు భారత్‌కు షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

