Rishabh Pant | గ్రిప్.. ట్విస్ట్.. పాడిల్.. రిషబ్ పంత్ సైక్లింగ్ వీడియో వైరల్
Rishabh Pant | గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీంఇండియా వికెట్ కీపర్ (Team India Wicket Keeper) రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా సైక్లింగ్ చేస్తున్న వీడియోను పంత్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో చాలా కష్టంగా సైక్లింగ్ (Cycling) చేస్తూ కనిపించాడు.
Rishabh Pant | గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీంఇండియా వికెట్ కీపర్ (Team India Wicket Keeper) రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. దాదాపు 8 నెలలుగా ఆటకుదూరమైన పంత్.. రీ ఎంట్రీ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే మెకాలి శస్త్రచికిత్స తర్వాత తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. బరువులు ఎత్తడం, గ్రౌండ్లో క్రికెట్ ఆడటం వంటివి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలతోపాటూ తన హెల్త్ అప్డేట్ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ బ్యాటింగ్ చేశాడు. ప్రమాదం తర్వాత తొలిసారి బ్యాట్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా సైక్లింగ్ చేస్తున్న వీడియోను పంత్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో చాలా కష్టంగా సైక్లింగ్ (Cycling) చేస్తూ కనిపించాడు. ఈ వీడియోకు ‘గ్రిప్. ట్విస్ట్. పాడిల్. గుడ్ వైబ్స్ ఓన్లీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Grip. Twist. Paddle.
Good vibes only. 🚴#RP17 pic.twitter.com/fH4JyycTen— Rishabh Pant (@RishabhPant17) August 28, 2023
మరోవైపు ప్రమాదం తర్వాత ఆటకు దూరమైన పంత్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకోసమే అతడు ఫిట్నెస్ కోసం కష్టపడుతున్నాడని సమాచారం. అంతేకాదు, పంత్‌కు తిరిగి జట్టులో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ( BCCI) కూడా భావిస్తోందట. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ ( England Test series) లో పంత్‌ను ఆడించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది ప్రారంభంలో పంత్ తిరిగి భారత జట్టులోకి చేరతాడన్నమాట.
కాగా, గతేడాది డిసెంబర్ 30వ తేదీన పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడికి పలు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం గాయాల నుంచి పంత్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Neeraj Chopra | ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. ఫిట్నెస్ సీక్రెట్ తెలుసా..?
Imran Khan | ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట.. తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష నిలిపివేత
Amazon | ఇకపై ఆఫీసుకు రావాల్సిందే, లేదంటే.. ఉద్యోగులకు అమెజాన్ గట్టివార్నింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

