ముంబై: ఆసియా కప్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌లో భాగంగా భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్, నేపాల్ టీమ్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదనే విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది.
గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ పరిస్థితి మెరుగుపడిందని, ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నప్పటికీ వంద శాతం ఫిట్నెస్ సాధించలేదని భారత్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. పాకిస్థాన్, నేపాల్ జట్లతో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ అందులో ఉండడని ఆయన తెలిపారు. కాగా, రేపటి (ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్ కోసం ఇండియా టీమ్ శ్రీలంకకు బయలుదేరుతున్నది. కేఎల్ రాహుల్ మరో వారం తర్వాత వెళ్లి జట్టుతో కలువనున్నారు.