INDW vs SLW : మహిళల ఆసియా కప్ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక(Srilanka) జయభేరి మోగించింది. మెగా టోర్నీలో తొలిసారి విజేతగా అవతరించింది. అజేయంగా టైటిల్ పోరుకు వచ్చిన భారత జట్టు(Team India)పై లంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 166 పరుగుల ఛేదనలో ఓపెనర్ చమరి ఆటపట్టు (61), హర్షిత సమరవిక్రమ(69 నాటౌట్)లు ఉతికేశారు.
టీమిండియా చెత్త ఫీల్డింగ్ కూడా లంక బ్యాటర్లకు వరమైంది. కవిష దిల్హరి(30 నాటౌట్)తో కలిసి 73 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన సమరవిక్రమ జట్టును విజయ తీరాలకు చేర్చింది. 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన లంక ఆరో ప్రయత్నంలో ట్రోఫీని సగర్వంగా అందుకుంది.
𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 🇱🇰🏆#WomensAsiaCup2024 #ACC #HerStory #SLWvINDW #GrandFinale pic.twitter.com/4knbEkIz5H
— AsianCricketCouncil (@ACCMedia1) July 28, 2024
మహిళల ఆసియా కప్ చరిత్రలో కొత్త చాంపియన్ అవతరించింది. ఏడుసార్లు చాంపియన్ టీమిండియాకు చెక్ పెడుతూ శ్రీలంక టైటిల్‌ను ఎగరసుకుపోయింది. దంబుల్లా స్టేడియంలో భారీ లక్ష్యాన్ని లంక మరో 8 బంతులు ఉండగానే ఊదేసింది. తొలుత భారత జట్టు 166 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన(60) మరోసారి అర్ధ శతకంతో మెరిసింది.
మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్(29) ధనాధన్ ఆడగా ఆఖర్లో రీచా ఘోష్(30) బౌండరీలతో విధ్వంసం సృష్టించింది. కవిష దిల్హరి వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది జట్టు స్కోర్ 150 దాటించింది. ఆఖరి ఓవర్లోనూ రీచా బౌండరీ కొట్టి ఔట్ కావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 రన్స్ కొట్టింది.
టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు ఉతికిపడేశారు. ఓపెనర్ విష్మీ గుణరత్నే(1) రనౌట్ అయ్యాక కెప్టెన్ చమరి ఆటపట్టు(61) విధ్వంసంక ఇన్నింగ్స్ ఆడింది. ఈ టోర్నీలో తొలి సెంచరీ కొట్టిన ఆమె హర్షిత సమరవిక్రమతో కలిసి భారత బౌలర్లను ఉతికేసింది. దాంతో, ఈ జోడీని విడదీసేందుకు హర్మన్‌ప్రీత్ తీవ్రంగా ప్రయత్నించింది.
𝐖𝐇𝐀𝐓. 𝐀. 𝐏𝐄𝐑𝐅𝐎𝐑𝐌𝐄𝐑. 🔥#WomensAsiaCup2024 #ACC #HerStory #SLWvINDW #GrandFinale pic.twitter.com/8xBh7Aw9cy
— AsianCricketCouncil (@ACCMedia1) July 28, 2024
అయితే.. అర్ధ శతకం తర్వాత దీప్తి శర్మ ఆమెను బౌల్డ్ చేసి బ్రేకిచ్చింది. కానీ, ఆ తర్వాత హర్షిత సమరవిక్రమ(69 నాటౌట్), దిల్హరా(30 నాటౌట్) లు పట్టుదలగా ఆడారు. వికెట్ల మధ్య వేగంగా పరుగెడుతూ డబుల్స్ తీస్తూ.. స్కోర్ బోర్డును ఉరికించారు. వీలుచిక్కినప్పుడు బౌండరీలతో జట్టును లక్ష్యానికి చేరువ చేశారు.
అయితే.. 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సమరవిక్రమ ఇచ్చిన సులవైన క్యాచ్‌ను భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేలపాలు చేసింది. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ భారత్ వైపు తిరిగేది. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన సమరవిక్రమ, దిల్హరలు బౌండరీలతో హోరెత్తించారు. పూజా వస్త్రాకర్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని దిల్హర స్టాండ్స్‌లోకి పంపింది. అంతే.. ఆసియా కప్ చరిత్రలో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న శ్రీలంక కల నిజమైంది.
A packed house at Dambulla was on their feet, as Harshitha Samarawickrama and Chamari Athapaththu bring home the Asia Cup 🏆✨https://t.co/uswfdQAxEa #SLvIND #AsiaCup2024 pic.twitter.com/rPDAnAFwOa
— ESPNcricinfo (@ESPNcricinfo) July 28, 2024