మెల్బోర్న్: పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో ఇండియా స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ(82 నాటౌట్) క్లాసిక్ ఇన్నింగ్స్‌తో పాటు హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ పాత్రను హార్ధిక్ పర్ఫెక్ట్గా పోషించాడు. బౌలింగ్‌లో 30 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇక బ్యాటింగ్‌లో 37 బంతుల్లో 40 రన్స్ స్కోర్ చేవాడు. కోహ్లీతో కలిసి 113 రన్స్ జోడించాడు. ఇక టీ20ల్లో పాండ్యా కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో వెయ్యి పరుగులు చేసి, 50 వికెట్లు తీసుకున్న తొలి ఇండియన్‌గా నిలిచాడతను.
పాక్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్లో పాండ్యాను మాజీ క్రికెటర్ క్రిష్టమాచారి శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేశాడు. పోలికలు చేయడం సరికాదు అని, కానీ, నువ్వు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్న తీరు కపిల్‌దేవ్‌ను గుర్తు చేసేలా ఉందని శ్రీకాంత్ అన్నారు. నువ్వు చూపిస్తున్న ప్రభావం.. అప్పట్లో కపిల్ చూపేవారన్నారు. శ్రీకాంత్ అన్న మాటలకు పాండ్యా నవ్వుతూ.. కపిల్ గ్రేటెస్ట్ ప్లేయర్ అని సమాధానం ఇచ్చారు.
పోస్టు మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. తన తండ్రిని హార్ధిక్ గుర్తు చేసుకున్నాడు. పిల్లల కలల్ని సాకారం చేసేందుకు తన తండ్రి ఎంతో కష్టపడినట్లు పాండ్యా చెప్పాడు. తమ భవిష్యుత్తు కోసం ఆయన ఎన్నో నగరాలకు మారినట్లు వెల్లడించాడు. తాను ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తన కోసం తన తండ్రి సొంత ఊరును, వ్యాపారాన్ని వదిలేసినట్లు చెప్పాడు.