గాలె:న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ విజయంపై కన్నేసింది. సమిష్టి ప్రదర్శనతో అదరగొడుతున్న లంక.. కివీస్‌కు చుక్కలు చూపిస్తున్నది. ఓవర్‌నైట్ స్కోరు 22/2 శనివారం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్..లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (6/42) ధాటికి 88 పరుగులకే కుప్పకూలింది. లంకపై టెస్టుల్లో కివీస్‌కు ఇదే అత్యల్ప తొలి ఇన్నింగ్స్‌గా రికార్డయ్యింది. సాంట్నర్ (29) టాప్‌స్కోరర్‌గా నిలువగా, మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. ఆ తర్వాత ఫాలోఆన్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సరికి 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. కాన్వె (61) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, విలియమ్సన్ (46), బ్లండెల్(47 నాటౌట్) రాణించారు. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి 315 పరుగుల దూరంలో ఉంది.