కొలంబో: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగవ రోజు భోజన విరామ సమయానికి శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 83 రన్స్ చేసింది. క్రీజ్‌లో పసిందు సూర్యబంద్ర 35, కమిందు మెండిస్ 10 రన్స్‌తో ఆడుతున్నారు. శ్రీలంక ఇంకా 130 రన్స్ వెనుకబడి ఉన్నది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను వశం చేసుకునేందుకు ఇండియాకు మరో 8 వికెట్లు అవసరం ఉన్నది. తొలుత ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇవాళ శ్రీలంకను 290 రన్స్‌కు ఇండియా ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫాలోఆన్ ఆడిన శ్రీలంక తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయి 83 రన్స్ చేసింది.
ప్రస్తుతం మ్యాచ్ ఇండియా ఆధీనంలోనే ఉన్నా.. లంక బ్యాటర్లు ఎలా ఆడుతారన్నదే ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్, జడేజాలు చెరో వికెట్ తీసుకున్నారు. అయితే సిరాజ్ గాయపడ్డాడు. ఓ క్యాచ్ అందుకోబోయి అతను కింద పడ్డాడు. లంక బ్యాటర్ దినుషా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.
It’s Lunch on Day 4 of the second #SLvIND Test!
1⃣ wicket each for Mohammed Siraj & Ravindra Jadeja as Sri Lanka trail by 130 runs!
We will be back for the Second Session 🔜
Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#TeamIndia pic.twitter.com/iFjclDTefn
— BCCI (@BCCI) August 26, 2026