HomeSportsSri Lanka On The Brink Of Defeat In The First Test On The Tour Of South Africa
ఓటమి అంచున లంక
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న శ్రీలంక తొలి టెస్టులో ఓటమి అంచున నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే ఆలౌట్ అయిన ఆ జట్టు ఎదుట సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 516 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపారు.
లక్ష్యం 526, ప్రస్తుతం 103/5
డర్బన్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న శ్రీలంక తొలి టెస్టులో ఓటమి అంచున నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే ఆలౌట్ అయిన ఆ జట్టు ఎదుట సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 516 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపారు. అయితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంకేయులు.. 31 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేశారు. ఆ జట్టు ఇంకా 413 పరుగులు వెనుకబడి ఉంది.
ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరిన నేపథ్యంలో ఆ జట్టుకు భారీ ఓటమి తప్పేలా లేదు. దినేశ్ చండిమాల్ (29 నాటౌట్), ధనంజయ డి సిల్వ క్రీజులో ఉన్నారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా.. 366/5 వద్ద సెకండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (122), సారథి టెంబ బవుమా (113) శతకాలతో మెరిశారు.