దుబాయ్ : ఆసియాకప్‌లో హాంకాంగ్‌పై శ్రీలంక చెమటోడ్చి విజయం సాధించింది. హాంకాంగ్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సనక(68) అర్ధసెంచరీతో రాణించగా, మిగతావారు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. ఈ విజయంతో గ్రూపు-బీలో లంక టాప్‌లోకి దూసుకొచ్చింది. ముర్తజా(2/37) రెండు వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో ఏకంగా 11 క్యాచ్‌లు విడిచిపెట్టిన హాంకాం గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. తొలుత నిజాఖత్ ఖాన్(52 నాటౌట్), అన్శి రాత్(48) రాణించడంతో హాంకాంగ్ 20 ఓవర్లలో 149/4 స్కోరు చేసింది. చమీర(2/29) రెండు వికెట్లు తీశాడు.