Sri Lanka | కొలంబో: సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో విజయం సాధించింది. నాలుగు రోజుల్లో ముగిసిన పోరులో లంక 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేయగా.. లంక 439 రన్స్ కొట్టింది.
రెండో ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసిన అఫ్గాన్.. ప్రత్యర్థి ముందు 56 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. లంక వికెట్ కోల్పోకుండా టార్గెట్ చేజ్ చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టిన ప్రభాత్ జయసూర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.