IPL 2025 : ఐపీఎల్లో 18 సీజన్ మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు కాగా.. చివరి బెర్తుపై ఉత్కంఠ నెలకొంది. నాకౌట్ రేసులో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన ఆరెంజ్ ఆర్మీ సారథి ప్యాట్ కమిన్స్(Pat Cummins) బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. కరోనా కారణంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) ఆడడం లేదని చెప్పిన కమిన్స్.. హర్ష్ దూబే, అథర్వ తైడేలను తీసుకున్నట్టు తెలిపాడు. ఇక లక్నో సైతం పేసర్ విలియం ఓ రూర్కీకి డెబ్యూట్ క్యాప్ అందించింది.
🚨 Toss 🚨@SunRisers won the toss and elected to bowl against @LucknowIPL in Match 6⃣1⃣
Updates ▶️ https://t.co/GNnZh90u7T#TATAIPL | #LSGvSRH pic.twitter.com/upINWS6jsc
— IndianPremierLeague (@IPL) May 19, 2025
లక్నో తుది జట్టు : మిచెల్ మార్ష్, ఎడెన్ మర్క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదొని, అబ్దుల్ సమద్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రథీ, విలియం ఓ రూర్కీ.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఈషన్ మలింగ.
గత రికార్డులు చూస్తే.. ఇరుజట్లు 5 సార్లు తలపడగా లక్నో 4 విజయాలతో ఆధిక్యంలో ఉంది. ప్లే ఆఫ్స్ సమరంలో నిలవాలంటే గెలవక తప్పని గేమ్ కావడంతో.. ఆరెంజ్ ఆర్మీపై ఉన్న రికార్డు తమకు లాభిస్తుందని.. విజయం తమనే వరిస్తుందని లక్నో భావిస్తోంది.