SRH Vs RR T20 | ఇండియన్ ప్రీమియర్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య టీ20 మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడని కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. గత సీజన్లో ఫామ్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అభిషేక్ శర్మ, హెడ్, నితీశ్‌రెడ్డి, క్లాసెన్ జట్టులో గత జట్టు సభ్యులు ఉన్నారని.. ఈ సారి ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేయనున్నట్లు తెలిపాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ కంటే.. ఎస్ఆర్హెచ్ మెరుగ్గా కనిపిస్తున్నది. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ తిరిగి జట్టుతో చేరడంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌ను మరింత బలంగా మారింది. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌పైనే అందరి దృష్టి నెలకొన్నది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉన్నది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చెలరేగితే జట్టు శుభారంభం చేసే అవకాశాలున్నాయి. గత సీజన్లోనూ సన్‌రైజర్స్ మూడుసార్లు 250 కంటే ఎక్కువ పరులు చేయడం విశేషం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 287, ముంబయి ఇండియన్స్‌పై 277, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులు చేసింది. ఈ సారి సీజన్లో సన్‌నైజర్స్ జట్టు అదే తరహాలో రాణించి.. టైటిల్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, శుభం దుబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్‌మైర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్హాక్ ఫరూఖీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమ్మిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్స్: సంజు శాంసన్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, క్వేనా మఫాక.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్స్ : సచిన్ బేబీ, జయదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్.