భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (2) థర్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పర నిర్ణయానికి అవుట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠి (0) డకౌట్ అయ్యాడు.
ప్రసిద్ధ్ కృష్ణ ఆఫ్‌స్టంప్‌కు ఆవల వేసిన షార్ట్ బంతిని కట్ చేయడానికి త్రిపాఠి ప్రయత్నించాడు. అయితే బంతి ఎక్స్ట్రా బౌన్స్ అవడంతో ఎడ్జ్ తీసుకొని శాంసన్ చేతుల్లో పడింది. దాంతో త్రిపాఠి ఇన్నింగ్స్ ముగిసింది. కాగా, త్రిపాఠి, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరూ గత సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వారే కావడం గమనార్హం.