ఎస్బీఐలో 12 వేల నియామకాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 12వేల కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్టు చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోపే ఈ నియామకాలు జరుగుతాయని శెట్టి వెల్లడించారు. తమ శాఖలో 250 కొత్త బ్రాంచులను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో కలిపి ఈ నియామకాలు ఉండే అవకాశం ఉందన్నారు.
- 250 బ్రాంచ్‌లు ప్రారంభిస్తున్నాము
- సంస్థ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడి
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 12వేల కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్టు చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోపే ఈ నియామకాలు జరుగుతాయని శెట్టి వెల్లడించారు. తమ శాఖలో 250 కొత్త బ్రాంచులను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో కలిపి ఈ నియామకాలు ఉండే అవకాశం ఉందన్నారు. రిటైర్మెంట్లు, ఉద్యోగుల అవసరాలను బట్టి కొద్దిగా మార్పులు ఉండవచ్చన్నారు.
గతేడాది తాము పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నామని.. ఎందుకంటే స్పెషలిస్ట్ ఐటీ అధికారులను 1,500 మందిని తీసుకున్నట్టు సీఎస్ శెట్టి చెప్పారు. ఈ ఏడాది ఐటీ విభాగంలో అంత ఎక్కువ మంది అవసరం లేదన్నారు. ఇప్పటికే అనేక బ్రాంచ్‌లు ఉన్నప్పటికీ.. కొత్తగా పెరుగుతున్న కాలనీలు, వాణిజ్య ప్రాంతాల్లో సంస్థను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఏడాది 200 నుంచి 250 కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 2026 నాటికి 2.45 లక్షల మందితో దేశంలోనే అతిపెద్ద నియామక సంస్థగా ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

