హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారకార్థం ప్రతి ఏడాది పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో 2026 సంవత్సరానికి ముగ్గురిని ఎంపిక చేసినట్టు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఉపాధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వ్యవసాయరంగంలో విశేష కృషి చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి, సాహిత్యరంగంలో వెలిచాల కొండలరావు, కళారంగంలో విశేష సేవలందిస్తున్న గొట్టే కనకవ్వను ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు.